ATP: ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సీనియర్ నేత రఘువీరా రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుంటూ కూలీల హక్కులు, గౌరవం కోసం నిరంతరం పోరాడుతామని కాంగ్రెస్ ప్రతిజ్ఞ పూనినట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యంగా ముందుకు సాగుతామని వెల్లడించారు.