అనంతపురం సుందరీకరణలో భాగంగా ఉమానగర్లో రూ.8.30 లక్షల వ్యయంతో చేపట్టే ఫుట్పాత్ నిర్మాణానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమిపూజ చేశారు. మల్లాలమ్మ గుడి నుంచి త్రివేణి టాకీస్ బ్రిడ్జ్ వరకు ఈ నిర్మాణం జరగనుంది. మున్సిపల్ కమిషనర్, అధికారులతో కలిసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, అనంతపురాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు.