ELR: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ భోగేశ్వరంలో శ్రీ పార్వతీ సమేత శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వారిని శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దాతల సహకారం కోసం ఏర్పాటు చేసిన సమీక్ష కార్యక్రమంలో పాల్గొని తనవంతుగా మూడు లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. అనంతరం మండప నిర్మాణ పనులను పరిశీలించారు.