NLG: మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని చిట్యాల మండలం పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం అన్నారు. శనివారం గ్రామంలోని మహిళలకు ఆయన చీరలను పంపిణీ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు మహిళల కోసం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.