KNR: ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా బోధనను వ్యాపారంగా మార్చేశాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి విష్ణు విమర్శించారు. జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల నుంచి రూ. వేలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యాయని మండిపడ్డారు.