AP: అన్నమయ్య జిల్లా పునర్విభజనపై వస్తున్న వదంతులపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని సూచించారు. రాయచోటిని మదనపల్లిలో కలుపుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.