KMM: ఎర్రుపాలెం మండలం మధిర మార్కెట్ యార్డ్ పరిధిలో మెప్మా, పీఎసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. రైతులు ఆయా కొనుగోళ్ళ కేంద్రాలలో కాటాలు, ఎగుమతులు విషయంలో కొద్దిగా జాప్యం జరుగుతుందని తెలిపారు.