W.G: జనవరి 4న విశాఖపట్నంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని జిల్లా నాయకుడు ఆంజనేయులు కోరారు. శనివారం వీరవాసరంలో సభకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు జరిగే అఖిల భారత మహాసభల్లో భాగంగా ఈ సభను నిర్వహిస్తున్నామని, ఉద్యోగ, కార్మిక, కర్షక విభాగాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.