అన్నమయ్య: రాజంపేట మున్సిపల్ కమిషనర్గా లక్ష్మీనారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని, పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.