AP: అమరావతిలోని మందడంలో రైతు రామారావు మృతిపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామారావు కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. రామారావు కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్కు ఆయన ఆదేశించారు.