RR: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మహిళకు గాయాలైన ఘటన మహేశ్వరం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మొహబ్బత్ నగర్ నుంచి తుక్కుగూడ వైపు నడుచుకుంటూ వెళుతున్న మహిళను వెనక నుండి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.