VKB: కోట్పల్లి ఆయకట్టు రైతులకు ప్రభుత్వం పంట సెలవు దినం ప్రకటించిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. 1967లో స్థాపించబడిన ప్రాజెక్టు స్వల్ప మరమ్మతులు, నిర్మాణ పనులకు గురి కావడంతో ఆధునీకరణ కోసం నీరు నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. 2025-26 రబీ సీజన్లో కుడి కాలువకు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.