కడప నగరంలో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు ‘నింగి నుండి నిఘా’ చేపట్టారు. SP నచికేత్ ఆదేశాలతో శనివారం డ్రోన్ కెమెరాలు, స్పెషల్ పార్టీలతో అల్మాస్ పేట, గుర్రాలగడ్డ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డ్రోన్ల ద్వారా పారిపోతున్న నిందితులను గుర్తించి పట్టుకుంటున్నారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.