ప్రకాశం: అర్థవీడులో వాహన తనిఖీలపై SI శివ నాంచారయ్య కొరడా ఝుళిపిస్తున్నారు. శనివారంసాయంత్రం హెల్మెట్, సరైన పత్రాలులేని వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఆయన తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పోలీసు సిబ్బంది వెల్లడించారు.