JN: సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రతీ పౌరుడికి ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం పొందే హక్కు ఉంది అని జనగామ జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల అధికారులకు కలెక్టరెట్ లో శనివారం RTI చట్టం పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. RTI చట్టాన్ని వినియోగించాలన్నారు.