PDPL: పెద్దపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ కారణంగా రైతులు ఇబ్బందుల్లో పడుతున్నారు. సాంకేతిక లోపాల వల్ల వారి వివరాలు సరిగ్గా నమోదు కాకపోవడం అన్నదాతలకు సమస్యగా మారింది. శనివారం యాప్లో 56,000 బస్తాలు ఉన్నట్లు చూపించగా, వాస్తవంలో కొరత ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.