BHPL: జిల్లా కేంద్రంలో శనివారం నూతన సర్పంచులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడారు. గ్రామ పాలనలో మహిళా సర్పంచులదే తుది నిర్ణయం కావాలని, భర్తల పెత్తనం సాగితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.