KMM: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) నాయకులు శనివారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి, కార్యాలయాల్లో పనిచేసే డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ విన్నపంపై సానుకూలంగా స్పందించిన మంత్రి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున తగిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు.