W.G: సంక్రాంతి వేళ పందేలకు అంతా సిద్ధమవుతుండగా.. ఆకివీడు మండలం కుప్పనపూడి పంచాయతీ ఆదర్శ నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలోని తాళ్లకోడు, శివ పార్వతీపురం తదితర గ్రామాల్లో కోడి పందేలు, పేకాట, గుండాట నిర్వహించవద్దంటూ సర్పంచ్ అనురాధ, సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు.