ELR: టీ.నర్సాపురంలో శనివారం ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న చిట్టిబొమ్మ శ్రీను నుంచి ఏడు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై నిరంతరం నిఘా ఉంటుందని హెచ్చరించారు.