SRPT: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ పిల్లలమర్రికి చెందిన జక్కలి నాగరాజు మానవత్వాన్ని చాటుకున్నారు. మఠంపల్లికి చెందిన గర్భిణి దివ్యకు అత్యవసరంగా ‘బి నెగిటివ్’ రక్తం కావాలని సోషల్ మీడియాలో వచ్చిన సమాచారానికి ఆయన తక్షణమే స్పందించారు. శనివారం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన 13వ సారి రక్తదానం చేశారు. ప్రాణదాతగా నిలిచిన నాగరాజును పలువురు అభినందించారు.