కృష్ణా: గుడివాడలోని జగనన్న కాలనీలో వీధిలైట్లు లేక చిన్న పిల్లలు, మహిళలు సహా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలుసుకొని, తక్షణమే స్పందించారు. ప్రజల భద్రత, సౌకర్యాలే లక్ష్యంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని కాలనీలో అవసరమైన ప్రాంతాల్లో కొత్త వీధిలైట్లను శనివారం ఏర్పాటు చేయించారు.