టాలీవుడ్ యంగ్ టైగర్ఎన్టీఆర్ తాజా చిత్రం “దేవర” సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఎన్టీఆర్, తన సినిమాకు అత్యధిక ఓపెనింగ్ అందించాలనే కసితో, ఎక్కువమందికి సినిమా చేరువవ్వాలనే ప్యాషన్ తో సినిమాను చాలా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ కి 6 సంవత్సరాల తరువాత సొలో రిలీజ్. అంతకుముందు, “అరవింద సమేత వీరరాఘవ” సినిమా సొలోగా విడుదలైనప్పటి నుండి, ఎన్టీఆర్ “RRR” వంటి భారీ ప్రాజెక్టుల్లో నటించాడు.
ఇప్పుడు, “దేవర” చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి, ఎన్టీఆర్ మంగళవారం చెన్నైకి వెళ్ళనున్నారు. ఈ సందర్భంలో, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా ఈ ఈవెంట్లో జాయిన్ అవుతాడని సమాచారం. ఈ ప్రమోషనల్ ఈవెంట్ యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది, దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫాన్స్ ఈ ప్రత్యేక సందర్భాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు.
“దేవర” ప్రపంచ బాక్సాఫీస్ వద్ద గొప్ప స్పందన కలిగి, విదేశాల్లో ప్రీమియర్స్ , నార్మల్ షోల సంఖ్యలో రికార్డులు సాధించబోతున్నది. తెలుగు రాష్ట్రాల్లో, ఈ సినిమా స్క్రీనింగ్ 1AM నుండి మొదలుకానుంది. ఎన్టీఆర్ అభిమానులు చాలా కాలంగా ఈ సినిమాను కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై వారికి చాలా అంచనాలున్నాయి
ప్రేక్షకులు, అభిమానులు, సినీ పరిశ్రమ ఈ సినిమా పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “దేవర” విడుదలతో, ఎన్టీఆర్ అభిమానులకి నిజంగా ఒక పండగ కాబోతుంది.