ఇండస్ట్రీ లో గురు శిష్యులు ఎంతోమంది ఉన్నారు, రైటర్లు, డైరెక్టర్లలలో అయితే ఆ సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. ప్రస్తుతం రాబోయే ఇండిపెండన్స్ డే 15ఆగష్టు న గురుశిష్యులు పోటీ పడుతున్నారు. పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తో, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ తో డీ అంటే డీ అంటున్నారు. రెండు సినిమాలకు ప్రమోషన్లు దంచికొడుతున్నారు. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రేపు రవితేజ మిస్టర్ బచ్చన్ ట్రైలర్ విడుదల కాబోతుంది
ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూ లో… పూరి జగన్నాథ్ అనే అతను ఎంతో మంది కొత్త రైటర్లకు ఇన్స్పిరేషన్… ఇడియట్ తరువాత ఇండస్ట్రీకి వచ్చిన ప్రతీ రైటర్, డైరెక్టర్ మీద పురీ జగన్నాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. క్యారెక్టర్ ఎలివేషన్ ఆయన రాసినట్టు ఏ రైటర్ రాయలేదు, నాకు తెలిసి రైటర్ అండ్ డైరెక్టర్ కంబినేషన్లో పూరి జగన్నాథ్ గారిని కొట్టే వారు ఇంకా రాలేదు…. ఎంతోమంది రైటర్లు రావొచ్చు, డైరెక్టర్లు కూడా రావొచ్చు… కానీ రెండు కలిపిన చాలా టాలెంటడ్ వ్యక్తి పురీ జగన్నాథ్’ అని హరీష్ శంకర తన గురువుని పొగడ్తలతో ముంచెత్తారు
డబుల్ ఇస్మార్ట్. మిస్టర్ బచ్చన్ తో పాటు అదే రోజు గీత ఆర్ట్స్ ఆయ్, సురేష్ ప్రోడ్యుకేషన్స్ నుంచి నివేత థామస్ నటించిన 35 రిలీజ్ అవబోతున్నాయి. ఈ రెండు చిన్న సినిమాల ట్రైలర్స్ కూడా బాగున్నాయి. అలాగే హిందీ లో జాన్ అబ్రహం వేదా కూడా తెలుగు లో రిలీజ్ అవబోతుంది.