KMM: మామిళ్లగూడెం పోస్టాఫీస్ వద్ద వున్న మెయిన్ కాల్వకు ఇరువైపులా వెంటనే డ్రెయినేజ్ నిర్మించాలని CPM డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీపీఎం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో పలు సమస్యలను పరిశీలించారు. పోస్టాఫీస్ వద్ద వున్న ఈ కాల్వకు ఇరువైపులా డ్రెయినేజ్ వాల్ లేకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం జలమయం అవుతుందని చెప్పారు.