AP: శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో పెళ్లింట విషాదం నెలకొంది. పెనుగొండ మండలం గుట్టూరుకు చెందిన యువతికి చింతమేకల శివానందతో వివాహం జరిగింది. అనంతరం డీజేలో అందరూ డాన్స్ చేశారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు తండ్రి కూడా డాన్స్ చేస్తూ.. ప్రమాదవశాత్తు డీజే వాహనం కిందపడి మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాధఛాయలు అలుముకున్నాయి.