అమెరికాలో భారత సంతతి వ్యాపారి రాకేశ్ ఇహగబన్ దారుణ హత్యకు గురయ్యారు. తన మోటెల్ ఎదుట పార్కింగ్‌లో గొడవ జరగడంతో దాన్ని ఆపేందుకు వెళ్లిన రాకేశ్‌పై నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో రాకేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అప్పటికే పార్కింగ్ వద్ద మరో యువతిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.