BDK: ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం మంచిది కాదని జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సోమవారం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ పాటించకపోతే చర్యలు తీసుకుంటామని అన్నారు. పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన ఆహ్వానం అందకపోయినా ఏమైనా ఇబ్బందులు తలెత్తిన తన దృష్టికి తీసుకురావాలన్నారు. గులాబీ సైనికుడిగా కంకణబద్ధులై పని చేయాలని అన్నారు.