TG: బీసీ రిజర్వేషన్ బిల్లుపై సుప్రీం కోర్టులో బలంగా పోరాడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘ఎంపిరికల్ డేటా ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని.. 1991-92లో సుప్రీంకోర్టు చెప్పింది. తెలంగాణలో చేసినట్లుగా సీపెక్ సర్వే ఎక్కడా చేయలేదు. ఎంపిరికల్ డేటాతో ముందుకొచ్చాం కాబట్టి.. సుప్రీంలో ఇబ్బంది ఉంటుంది అనుకోవడంలేదు’ అని పేర్కొన్నారు.