AP: విజయవాడ ఎనికేపాడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 7 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పలు ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.