AKP: జిల్లాలో సంపద కేంద్రాల ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకోవాలని డిప్యూటీ ఎంపీడీవో ఎస్. రాయవరం బంగారు సత్యనారాయణ సూచించారు. సోమవారం చినగుమ్ములూరు సంపద కేంద్రాన్ని సందర్శించారు. గ్రామంలో సేకరించిన చెత్తను సంపద కేంద్రానికి తరలించి సేంద్రియ ఎరువుగా మార్చి విక్రయిస్తే ఆదాయం వస్తుందన్నారు. సచివాలయ సిబ్బంది దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.