GNTR: గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరో మహిళ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బీసీ కాలనీకి చెందిన కృష్ణవేణి గత పది రోజులుగా జ్వరం, శరీరంపై గడ్డలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. అయితే, కృష్ణవేణి డయాబెటిస్ (మధుమేహం) కారణంగా మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.