ప్రకాశం: జరుగుమల్లిలో నాలుగు టన్నుల చౌక బియ్యాన్ని స్థానిక పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. మినీ ట్రక్కులో 80 బస్తాల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. ఈనేపథ్యంలో ట్రక్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నెల్లూరు జిల్లా కావలికి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.