SKLM: పాతపట్నం మండలం తీమర గ్రామంలో సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జీఎస్టీ 2.0 పై ప్రజలకు అవగాహన కల్పించారు. జీఎస్టీ 2.0 ద్వారా రైతుల పనిముట్లలో 12శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఇది రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.