AKP: బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలుకుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు, ఎం. అప్పలరాజును పోలీసులు మళ్లీ సోమవారం తన స్వగ్రామం అయిన ఎస్. రాయవరం మండలం ధర్మవరంలో గృహనిర్బంధంలో ఉంచారు. ఆదివారం ఉదయం నిర్భందించిన పోలీసులు సాయంత్రం వెళ్ళిపోయారు. తిరిగి సోమవారం వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కాపలాగా ఉన్నారు.