WGL: ఉమ్మడి జిల్లాలో మహాలక్ష్మి పథకంతో RTC ప్రయాణికుల అక్యుపెన్సీ రేషియో 100 శాతానికి చేరింది. 9 డిపోల పరిధిలో గతంలో 35% మహిళలు ప్రయాణించగా, 2023 డిసెంబర్ 9 నుంచి 2025 సెప్టెంబర్ 15 వరకు 16.8 కోట్ల మంది ప్రయాణించారు. దీనివల్ల RTCకి రూ.757.73 కోట్ల ఆదాయం వచ్చింది. గ్రామీణ మహిళలు ఉచిత బస్సుల ద్వారా నగరానికి వచ్చి అవసరాలు తీర్చుకుంటున్నారు.