AP: లిక్కర్ స్కామ్లో అరెస్టైన నిందితుల రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. దీంతో సిట్ ఈ రోజు వారిని విజయవాడ ACB కోర్టులో హాజరుపరచనుంది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ కాగా.. ఐదుగురు బెయిల్ పొందారు. మిగిలిన ఏడుగురు జుడీషియల్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అటు MP మిథున్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కూడా నేడు హైకోర్టులో విచారణకు రానుంది.