డ్రగ్స్ అమ్మకానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు డ్రగ్ పెడ్లర్స్. ఎక్కడో నిర్మానుష్య ప్రాంతాల్లో మాత్రమే జరిగే డ్రగ్స్ దందాలు రూటు మార్చి కాలనీల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా రాపిడో డ్రైవర్ల ముసుగులో డోర్ డెలివరీ కూడా చేసేస్తున్నారు.
హైదరాబాద్ సరూర్ నగర్లో నాలుగురు యువకులు రాపిడో బైక్ డ్రైవర్ల ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని తెలిసింది. డోర్ డెలివరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు SOT పోలీసులు.
అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు రమేష్ కుమార్ (23), మహాదేవ్ రామ్ (25) ఉన్నారు. మాదకద్రవ్యాలకు బానిసలై, ఆర్థిక పరిస్థితుల కారణంగా రాజస్థాన్ లో డ్రగ్స్ కొని హైదరాబాద్ లో లాభాలకు అమ్మడం ప్రారంభించారు. వీరు దగ్గర నుంచి 34 గ్రాముల హీరోనే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తెలంగాణ ప్రభుత్వం నార్కోటిక్ డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో SOT పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ హీరోలను, ప్రొడ్యూసర్లను సైతం డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి సినిమా హీరోల సహకారం కావాలని కోరిన సంగతి తెలిసిందే.