NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రభుత్వం సీట్ నోటీసులు జారీ చేయడంతో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. KCRను ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ, రాజకీయంగా అవమానపరిచేలా ప్రభుత్వం ప్రవర్తిస్తుందని మండిపడ్డారు.

