పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ కూడా తోడవడంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా ధరలు భారీగా పెరిగాయి. హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మార్కెట్లో ఇప్పటికే ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

