సూర్యాపేట జిల్లాలో నామినేషన్ల దాఖలు పూర్తయి బుజ్జగింపుల పర్వం మొదలైంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు రాయబేరాలు ప్రారంభించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 3 వరకు గడువు ఉండడంతో సూర్యాపేట, కోదాడ, నేరేడుచర్ల లాంటి మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులను బుజ్జగించే పనిలోపడ్డారు.

