TG: రాష్ట్ర ఆర్థిక పటిష్టతకు కేంద్ర ఎకనామిక్ సర్వే అద్దం పడుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 2023-24లో జాతీయ ద్రవ్యోల్బణం సగటు 4.63% ఉండగా, తెలంగాణలో అది కేవలం 3.6% మాత్రమే నమోదైంది. దేశ సగటు కంటే రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం తమ ప్రభుత్వ సమర్థ పాలనకు నిదర్శనమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

