NGKL: జిల్లా కేంద్రంలోని రెండో వార్డు సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ శ్రీనివాసులకు మద్దతుగా స్థానిక నాయకులు ఆదివారం ఉదయం ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న సీపీఎం పార్టీకి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

