ELR: కామవరపుకోట మండలం తడికలపూడిలోని తోటలో కొబ్బరి కాయలు కోతకు శనివారం 18 మంది కూలీలు వెళ్లారు. ఈ క్రమంలో కూలీలు కొబ్బరి కాయలు కోస్తుండగా విద్యుత్ తీగలు లారీపై పడడంతో మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో లారీపై కూర్చున్న దెందులూరు మండలం వేగవరం గ్రామానికి చెందిన పామర్తి మల్లికార్జున అనే దివ్యాంగుడు మంటలు అంటుకుని సజీవదహనమయ్యాడు.

