AP: అధికార దుర్వినియోగానికి పాల్పడిన బాపట్ల జిల్లా కర్లపాలెం డిప్యూటీ MRO శ్రీదేవిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె తన కారును VRAతో కడిగించినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రజలకు సేవలు చేయాల్సిన సిబ్బందిని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.