ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. ఇలా గుండెపోటు వచ్చిన ఘటనలు అనేకం చూశాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా గుండెపోటు వచ్చిన ఘటనలు ఉన్నాయి. ఇక తాజాగా మాజీ మంత్రి , పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి (MLA Parthasarathy) గుండెపోటుకు గురయ్యారు. శనివారం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురై పార్థసారథి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేను పరీక్షించిన వైద్యులు ఆయనకు హార్ట్ ఎటాక్ (Heart attack) వచ్చిందని నిర్ధారించారు.
అశోక్‌నగర్‌లోని టాప్ స్టార్ హాస్పిటల్(Star Hospital)లో పార్ధసారథికి వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేకు యాంజియోగ్రామ్(Angiogram) చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం పార్థసారథి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పార్థసారథి అస్వస్థతకు గురైన విషయం తెలిసి వైసీపీ నేతలు(YCP leaders) కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరిగే వారు చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటలను చాలా చూస్తుంటాం. దానికి కారణం.. కార్డియాక్ అరెస్ట్. ఈ కార్డియాక్ అరెస్ట్ (Cardiac arrest) ద్వారా వ్యక్తులు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ప్రమాదంలో పడిన గుండెకు సత్వర చికిత్స అత్యవసరం. గుండెపోటు వచ్చిందంటే.. ఆస్పత్రికి చేర్చి వైద్య చికిత్స అందించేలోపు ఏమైనా జరిగే ప్రమాదం ఉంది.