ఎమ్మెల్యే టికెట్ కోసం సీఎం జగన్ (CM JAGAN)ని ఐదు సార్లు కలిసినా మొఖాన ఉమ్మేసినట్టు.. ‘నీకు టికెట్ ఇవ్వటం లేదని చెప్పారని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే (Udayagiri MLA) మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. వేరే వ్యక్తిని చూస్తున్నాం. నీకు కావాలంటే ఎమ్మెల్సీ ఇస్తాం’ అని అన్నారు. ఇది గిట్టుబాటు అయ్యేది కాదని అనిపించింది’’ అని ఆయన తెలిపారు. ఇక లాభం లేదనుకొని పార్టీ నుంచి బయటికి వస్తున్నానని, త్వరలోనే తెలుగుదేశం పార్టీ (TDP) లో చేరతానని మేకపాటి తెలిపారు .
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy)వెల్లడించారు. తనతోపాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరతారని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు (Badvelu) నియోజకవర్గం అట్లూరు విడిది కేంద్రంలో లోకేశ్‌ను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. లోకేశ్ పాదయాత్ర నెల్లూరు జిల్లా ఉదయగిరిలోకి ప్రవేశిస్తుండగా.. స్వాగతం పలికి యాత్రను దిగ్విజయం చేస్తానని అన్నారు. నారా లోకేశ్(Nara Lokesh)ను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించాని ఆయన అన్నారు. పాదయాత్ర ఉదయగిరిలోకి ప్రవేశిస్తున్న నేపథంలో ఆయన్ని ఆహ్వానించాలని ఇక్కడికి వచ్చాన్నారు. నా నియోజకవర్గంలో పాదయాత్రను విజయవంతం చేస్తా’’ అని చెప్పారు.