ఆయుధాలు వదిలేసి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. ఆపరేషన్ కగార్‌ను, ఎన్కౌంటర్లను నిలిపివేస్తే ఆయుధాలు వదిలేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో తెలిపారు. సీపీఐ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ లేఖ విడుదలైంది. 2026 మార్చిలోపు మావోయిస్టు రహిత భారత్‌ను ప్రకటిస్తామని షా చేసిన ప్రకటనకు ఇది సానుకూల స్పందనగా విశ్లేషకులు భావిస్తున్నారు.