AP: రాష్ట్రంలోని పేద ప్రజలకు గృహాలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి 40,410 గృహాలు మంజూరయ్యాయి. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. రాష్ట్రంలో ఇళ్లు లేని పేద ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ఈ గృహాల మంజూరు ఎంతో ఉపయోగపడుతుంది.