ELR: మాజీ మంత్రి రోజా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్, దెందులూరు జనసేన ఇంఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి ఘాటుగా బదులిచ్చారు. రోజా జబర్దస్త్ ద్వారానే ప్రజలకు తెలుసని, మంత్రిగా ఆమె చేసిందేమీ లేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన ప్రజా నాయకుడని తెలిపారు.